📚✍️జూన్ లో టెట్ నిర్వహణ✍️📚
🌻ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను జూన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. టెట్ను ప్రతి యేటా నిర్వహిం చాలనే నిబంధన ఉన్నా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సమయంలోనే దీన్ని నిర్వహిస్తున్నారు. 2018 తర్వాత రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. అప్పట్లో ఉపాధ్యాయ నియామక పరీక్షతో పాటు టెట్ను నిర్వ హించారు. 2018 నుంచి ఇప్పటి వరకూ వందల మంది డీఈడీ, బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామ కాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంది.
No comments:
Post a Comment