*డిపార్ట్ మెంటల్ టెస్ట్*
👇👇👇
*ఏపీపీఎస్సీ(APPSC Departmental Tests) డిపార్ట్ మెంటల్ టెస్ట్ నవంబర్ 2022 సెషన్ డిశంబర్ 9 నుండి 14 వరకు ఎపిపిఎస్సీ (APPSC) నిర్వహించనున్న డిపార్ట్ మెంటల్ పరీక్షలు నవంబర్ 2022 సెషన్ నోటిఫికేషన్ తేది.* *12-09-2022 విడుదల చేసి తేది 14-09-2022 నుండి తేది.10-10-2022 వరకు దరఖాస్తులు స్వీకరించారు. హాల్ టికెట్లు డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తారు.* *హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ pso.ap.gov.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ పరీక్షలు తేది.* *09-12- 2022 నుండి తేది 14-12-2022వరకు నిర్వహించనున్నారు.*
*ఎపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ తేదీకి ముందే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని చివరి నిమిషంలో సర్వస్ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో ఈ పరీక్షలు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఈ శాఖాపరమైన పరీక్షలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం !*
👉🏿 *సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 24 సంవత్సరాల స్కేలు, స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే జి.ఓ టెస్ట్ ఇ.ఓ. టెస్ట్ పాసవ్వడం తప్పనిసరి. జి.ఓ టెస్ట్ పేపర్ కోడ్లు 88 మరియు 97 కాగా ఈ పరీక్ష తేది 11-12-2022న జరగనుంది. ఇ.ఓ. టెస్ట్ పేపర్ కోడ్ 141 ఈ పరీక్ష తేది. 12-12-2022న జరగనుంది.*
👉🏿 *సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా 45 సంవత్సరాలు వయసు దాటిన వారికీ ఈ శాఖాపరమైన పరీక్షలు నుండి మినహాయింపు ఉంది.*
👉🏿 *50 సంవత్సరాలు వయసు పూర్తయిన వారికి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు అవసరం లేదు,*
👉🏿 *డిపార్ట్ మెంటల్ టెస్ట్ పరీక్షకు హాజరుగు ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో 2 సార్లు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తారు.*
👉🏿 *ఇంటర్, డి.ఇ.డి అర్హత కలిగి బి.యిడి అర్హత లేనివారు PAT పరీక్ష, మున్సిపల్/ఎయిడెడ్ ఉపాధ్యాయులు HMA టెస్ట్ రాయవలెను.*
👉🏿 *విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలలో ఉత్తీర్ణత సాధించడం కోసం GO.Ms.No.74, dated 29.12.2008 ఉత్తర్వులు ద్వారా 5 సంవత్సరాలు మరియు G.O.Ms.No. 193, dated 28.04.2014 ఉత్తర్వులు ద్వారా మరో 5 సంవత్సరాలు పాస్ అవటం కోసం పొడిగింపు ఇచ్చారు. ఈ గడువు ముగిసిన నేపద్యంలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత. పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలో ఉత్తీర్ణత సాధించడం కోసం చివరి అవకాశంగా మరో ఏడాది పాటు సమయం ఉత్తర్వులు GO Ms No 87 GAD dt. 2-9-2022 జారీ చేశారు.*
No comments:
Post a Comment